Header Banner

టెక్ ఉద్యోగులపై పెరుగుతున్న ప్రభావం! ఒకేసారి వేలమంది..! ఇంకా కొనసాగుతుంది!

  Tue Apr 08, 2025 09:44        Employment

టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 2025 మార్చిలో కనీసం 21 టెక్ కంపెనీలు 8,834 మందిని ఉద్యోగాలు కోల్పోయినట్టు layoffs.fyi అనే రియల్ టైమ్ పోర్టల్ వెల్లడించింది. ఇది ఫిబ్రవరిలో జరిగిన 15,994 తొలగింపులతో పోలిస్తే కొంత తగ్గుదల అయినప్పటికీ, ఇప్పటివరకు జరిగిన అత్యధిక తొలగింపుల్లో ఇదీ భాగమే. హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్, నార్త్‌వోల్ట్, బ్లాక్, ఓలా ఎలక్ట్రిక్, నియాంటిక్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈ కోతలు కంపెనీల నష్టాలను తగ్గించేందుకు, వ్యాపార వ్యూహాలను తిరిగి పునఃసంఘటించేందుకు చేపట్టిన చర్యలుగా కనిపిస్తున్నాయి.

 

ప్రత్యేకంగా ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఈ ఏడాది రెండవ సారి ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఏకంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో, HP దాదాపు 2,500 ఉద్యోగాలను తొలగించగా, నార్త్‌వోల్ట్ తన 4,500 మంది ఉద్యోగుల్లో 2,800 మందిని తొలగించింది. HP తన ఖర్చులను తగ్గించేందుకు మరియు 2027 నాటికి $350 మిలియన్ల ఆదాయాన్ని ఆదా చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. మరోవైపు, బ్లాక్ సంస్థ 931 ఉద్యోగులను, బైట్‌డాన్స్ 300 మందిని తొలగించాయి. ఈ సమస్త చర్యలు టెక్ రంగంలో ప్రస్తుత అస్థిరతను సూచిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ తెలుసుకోండి! డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TechLayoffs #JobCuts2025 #PinkSlipSeason #LayoffsUpdate #TechIndustryCrisis #OlaLayoffs #HPLayoffs